కరోనా మృతుల్లో 10 మంది 50 ఏండ్లు దాటినోళ్లే..

రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది మృతి
పెద్దలకే రిస్క్ ఎక్కువ 
అన్ని వయసుల వారికీ వైరస్ సోకే చాన్స్

 

కరోనా వైరస్ సోకినవారిలో పెద్ద వయసు వారి పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారిలో ఎక్కువగా 50 ఏళ్లు దాటినవారే ఉన్నారు. ఇప్పటివరకు 11 మంది కరోనాతో చనిపోగా అందులో 10 మంది 50 ఏండ్లుపైబడినవాళ్. అయితే లే చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఈ వైరస్సోకుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఇమ్యూనిటీ తగ్గి పోయి..
రాష్ట్రంలోకరోనా వైరస్ బారినపడ్డ వారిలోఇప్పటివరకు 11 మంది చనిపోయినట్టు సర్కారు వెల్ల డించింది. నిబంధనల మేరకు అధికారికంగా పేర్లు, ఊర్లను ప్రకటించలేదు. అయితే మరణించినవారి వయసు, పరిస్థితిని విశ్షించిన డాక్టర్లు.. పెద్దవయసు వారికి ముప్పు ఎక్కువని, మరణించే ప్రమాదం కూడా వాళ్లలోనే ఎక్కువని చెప్తున్నారు. ‘‘ఐదు పదులు దాటిన వాళ్లలో కరోనా ప్రభావం మిగతా వారి కంటే ఎక్కువగా ఉంటోంది. వయసు రీత్యా ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) వారిలో తక్కువగా ఉంటుంది. అదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది’’ అని పల్మనాలజిస్టు డాకర్్టవి.సురేశ్ తెలిపారు. 50
ఏండ్లు దాటినవాళలో్ల కొందరు కరోనాను తట్టు కొని, కోలుకున్నారని.. ఇతర దీర్గకాలిక రోగాలున్న వారిలో రిస్క్ ఎక్కువగా ఉందని జనరల్ మెడిసిన్ప్రొఫెసర్ వి.చంద్రశేఖర్ తెలిపారు. కరోనా వైరస్ తో 60 ఏండ్లు దాటిన వారికి,
పదేళ్లలోపు పిల్లలకు ఎక్కువ ప్రమాదమని తమ అబ్జర్వేషన్లోతేలిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక మూడేండ్ల పాపకు, ఎనిమిది నెలల బాబుకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. వారు క్రమంగా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు.

కాస్త ఆలస్యం చేసినా..
శనివారం నాటికి రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారు 11 మంది. వారిలో ఆరుగురు హైదరాబాద్ కు చెందిన వారే. ఒకరు 74 ఏళ్ల వయసున్న వృద్ధుడు కాగా.. మిగతావారు 68, 60, 55, 60, 44 ఏళ వయసువాళ్ ్ల లు. ఇక నిర్మల్ లో 56 ఏళ వ్యక్తి, గద్వాలలో 63 ఏళ వృద్ధుడు, నిజామాబాద్లో62 ఏళ్లున్న వృద్ధులు కరోనాకు బలయ్యారు. షాద్నగర్ లోచనిపోయిన మహిళ
కు55 ఏండ్లని డాక్టర్లు్ చెప్పారు. వారిలో ఇద్దరు చనిపోయిన తర్వాత టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ తేలిందని, మిగతా వారు ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారని చెప్పారు. వీరందరిలో ఒక మహిళ మినహా అందరూ తబ్లిగి జమాత్
కు హాజరైనవారే. వారందరికీ ఢిల్లీలోనే కరోనా సోకిందని, ఆలస్యంగా గుర్తించడం, లక్షణాలు కనిపించిన వెంటనే ట్రీట్ మెంట్తీసుకోకపోవ డంతో డెత్ రేట్ పెరిగిందన్నారు.

Latest Updates