ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మృతుల సంఖ్య‌

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6133 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,93,484కు చేరుకుంది. ఇక ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో కొత్తగా 48 మంది చనిపోయారు. మంగళవారం 35 కరోనా మరణాలు సంభవించగా, బుధవారం ఆ సంఖ్య 48కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 6, తూర్పు గోదావరి 5, కృష్ణా 5, విశాఖ 5, అనంతపురం 4, గుంటూరు 4, పశ్చిమ గోదావరి 4, కడప 3, కర్నూలు 2, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5828కు చేరింది.

Latest Updates