ఏపీలో కొత్తగా 3,342 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3342 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,04,026కు చేరింది. శుక్ర‌వారం ఒక్కరోజే వైరస్ కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,566కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 3,572 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 7,65,991కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 31,469 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 10.72శాతంగా ఉండగా… ప్రతి మిలియన్‌ జనాభాకు 1,40,504 పరీక్షలు చేస్తున్నారు.

Latest Updates