ఏపీలో 200 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైర‌స్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 38 వేలకు పైగా శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 837 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డిం‌చింది. అందులో 789 మంది లోక‌ల్స్ కాగా, ఇద్ద‌రు విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు, 46 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారు ఉన్నారు. తాజాగా నమోదైన కేసుల‌తో క‌లిసి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 16,934కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 8 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాల్లో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 206కి పెరిగింది. ఆస్ప‌త్రుల్లో చికిత్స త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 7,632 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని వేర్వేరు ‌ ఆసుపత్రుల్లో 9,096 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా క‌రోనా కేసుల వివ‌రాలు:

Latest Updates