కరోనా రావద్దని హోమం చేసిన్రు

మల్కాజ్‌గిరి, వెలుగు: కరోనా వైరస్ దేశంలో వ్యాపించకూడదని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హోమం చేశారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ వ్యాధి వల్ల ఎలాంటి ప్రమాదం కలగకూడదని ఆదివారం పోతాయిపల్లిలోని శ్రీరామభద్ర క్షేత్రంలో కుటుంబసమేతంగా చండీ హోమం నిర్వహించారు. ఆలయ ధర్మ కర్త, శంకర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు కార్యక్రమం పూర్తి చేశారు.

Latest Updates