కరోనా ఎఫెక్ట్: 27 అడుగుల ఖైరతాబాద్ గణేషుడు

గతేడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్నాడు హైదరాబాద్  ఖైరతాబాద్ గణేషుడు. కరోనా కారణంగా ఈ ఏడాది 27 అడుగులకే పరిమితం కానున్నాడు.  ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్  కారణంగా ఈ సారి ఖైరతాబాద్ గణేషుడి విగ్రహన్ని తక్కువ ఎత్తుకే పరిమితం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. గతేడాది కంటే 38 అడుగులు తక్కువగా విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అలాగే ఈ సారి పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని రూపొందించాలని ఖైరతా బాద్ గణేష్ కమిటీ నిర్ణయించింది.  భౌతికదూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

Latest Updates