కరోనా ఎఫెక్ట్ : లక్ష జాబ్స్ తో అమెజాన్ ఆఫర్

కరోనా ఎఫెక్ట్… అమెజాన్ ఆఫర్
యూఎస్ లో లక్ష జాబ్స్ 
ఆన్​లైన్ సేల్స్ పెరగడంతో
వర్కర్లు కావాలని కంపెనీ ప్రకటన

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్నీ బంద్ అవుతున్నాయి. షాపింగ్ మాల్స్, థియేటర్లు, వివిధ కంపెనీలు మూసేస్తుండడంతో చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. కానీ ఇలాంటి సమయంలో లక్ష మందికి జాబ్స్ ఇస్తామంటోంది అమెజాన్. ఎందుకంటే… కరోనా ఎఫెక్ట్​తో ఆన్ లైన్ సేల్స్ పెరుగుతుండడమే కారణం. డిమాండ్ కు తగ్గట్లు సకాలంలో వస్తువులను సరఫరా చేసేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటోంది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాల్లో షట్ డౌన్ పరిస్థితి నెలకొంది. వైరస్ భయంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి అవసరమైన వస్తువులపై జనం ఆన్ లైన్ సైట్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోవడంతో అమెజాన్ అదనంగా వర్కర్లను నియమించుకుంటోంది.

ఒక్క యూఎస్ లోనే లక్ష మంది వర్కర్లను తీసుకుంటోంది. యూకే, యూరోప్ లలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో… అక్కడి ప్రజలకు కావాల్సిన వస్తువులు అందజేసేందుకు చర్యలు తీసుకుంటోంది. యూఎస్ లోని వర్కర్లకు ప్రస్తుతం గంటకు రూ.1,112 చెల్లిస్తుండగా, అదనంగా మరో రూ.148 ఇస్తామని ప్రకటించింది. అదే విధంగా యూరోప్, యూకేలలో గంటకు రూ.179 ఎక్స్ ట్రా ఇవ్వనుంది. ‘‘యూఎస్ వ్యాప్తంగా లక్ష ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల డిమాండ్ కు అనుగుణంగా సేవలందించేందుకు మేం చర్యలు తీసుకుంటున్నాం. షట్ డౌన్ కారణంగా చాలామంది జాబ్స్ కోల్పోయారు. వారందరూ మా కంపెనీలో చేరొచ్చు” అని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ తెలిపారు. ఇంటి సరుకులకు డిమాండ్ ఎక్కువగా ఉందని, సరిపడా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో నియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత

Latest Updates