కరోనా ఎఫెక్ట్: 31 వరకు స్కూల్స్, కాలేజీలు, సినిమా హాల్స్ బంద్

31 వరకు స్కూల్స్, కాలేజీలు, సినిమా హాల్స్ బంద్

కరోనా ఎఫెక్ట్ తో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 31 వరకు స్కూల్స్, కాలేజీలు, సినిమా హాల్స్ ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ఢిల్లీ ప్రభుత్వం హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. లెఫ్టి నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఉన్నతాధికారులు మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నెల 31 వరకు స్కూల్స్, కాలేజీలు, సినిమా హాళ్లు మూసివేయాలని నిర్ణయించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నారు.

Latest Updates