పేపర్ల 10 పేజీలూ శ్రద్ధాంజలి ఫొటోలే

ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 360 మంది కరోనా కాటుకు బలైపోయారు. ఇప్పటిదాకా1800 మందికి పైగానే ఈ వైరస్ కు బలైపోయారు. ఆ దేశం టీవీలు, పేపర్లలో ఎక్కడ చూసినా చావు వార్తలే కన్పిస్తున్నయి. ఈ క్రమంలో ఇటలీలో ప్రముఖ న్యూస్ పేపర్ అయిన ‘ఎల్ఎకో డీ బెర్గామో’లో శ్రద్ధాంజలి ప్రకటనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మామూలు దినాలల్ల ఈ పేపర్ లో రోజూ ఒక పేజీ, పేజిన్నర శ్రద్ధాంజలి ప్రకటనలు వచ్చేవట. ఇప్పుడు మాత్రం ఏకంగా10 పేజీలు శ్రద్ధాంజలి ప్రకటనలతోనే నిండిపోతున్నాయట. ఈ విషయం గురించి చెప్తూ, ఎవరో పేపర్ ఫొటోలను తీసి ట్విట్టర్ లో పెట్టారు. దీంతో ‘ఇటలీకి ఎంత కష్టం వచ్చింది.. ’ ‘ఎన్ని కుటుంబాలు ల్లాడుతున్నాయో.. ’ ‘చనిపోయినోళ్ల ఆత్మలకు శాంతి కలగాలి..’ అంటూ నెటిజన్లంతా విచారం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates