‘కరెన్సీపై కరోనా’ భయం..?

నోట్లతో వైరస్ వస్తుందనే భయం
పెరిగిన డిజిటల్ పేమెంట్స్

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్​జనాలను అన్ని రకాలుగా భయపెడుతోంది. ఏ వస్తువు ముట్టుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అది ఇంటికి వచ్చే పాల ప్యాకెట్​అయినా, కరెన్సీ నోటైనా పట్టుకోవాలంటే హడలిపోతున్నారు. బయటి నుంచి ఏ వస్తువు తెచ్చినా శుభ్రంగా కడిగాకే వాడుతున్నారు. కానీ నోట్లపై వైరస్​ ఉంటుందని అనుమానం ఉన్నా నీళ్లు, శానిటైజర్​తో తొలగించే పరిస్థితి లేకపోవడంతో డిజిటల్​పేమెంట్స్​కే మొగ్గు చూపుతున్నారు.

నోటు ముట్టకున్నా వాష్​ చేసుకోవాల్సిందే..

కరోనా సోకిన వ్యక్తి  కరెన్సీ నోటును ముట్టుకుంటే అది చాలా మంది చేతులు మారే అవకాశముంటుంది. కొందరు వేలిని నోటితో తడి చేసి నోట్లను లెక్కిస్తారు. దీనివల్ల వైరస్​ విస్తరించే అవకాశం ఉంటుంది. దీంతో కస్టమర్లయినా, షాపు ఓనర్లయినా డిజిటల్​పేమెంట్స్​కే ఆసక్తి చూపిస్తున్నారు. రూపాయి నుంచి మొదలుకుని ఎన్ని వందలైనా ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం, అమెజాన్​ పే, ఫ్రీచార్జ్​ లాంటి యాప్స్​ఉపయోగించి చేస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నోట్లు తీసుకోవాల్సి వస్తే చేతులు కడుక్కోవడమే మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Latest Updates