సీఎం, ఎమ్మెల్యేలకు 60%.. ఉద్యోగులకు 50% జీతం క‌టింగ్

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితిపై ఒక్క‌సారిగా ఊహించ‌ని స్థాయిలో ప్ర‌భావం ప‌డ‌డంతో ఒక్కో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జాప్ర‌తినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఇవాళ తాజాగా మ‌హారాష్ట్ర స‌ర్కారు కూడా అదే బాట‌లో నిర్ణ‌యం తీసుకుంది. సీఎం, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి గ్రేడ్ – C ఉద్యోగుల వ‌ర‌కు అంద‌రికీ మార్చి నెల‌ జీతాల్లో కోత పెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ ప‌వార్.

జీతంలో కోత‌ల శాతం ఇలా

  • సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిదుల జీతంలో 60 శాతం క‌టింగ్.
  • గ్రేడ్ – A, గ్రేడ్ – B అధికారుల జీతాల్లో 50 శాతం కోత‌.
  • గ్రేడ్ – C ఉద్యోగుల జీతాల్లో 25 శాతం త‌గ్గింపు.
  • గ్రేడ్ – D ఉద్యోగుల‌కు మాత్రం జీతం నుంచి ఎటువంటి కోత‌లు లేకుండా పూర్తిగా చెల్లిస్తామ‌ని అజిత్ ప‌వార్ స్ప‌ష్టం చేశారు.

More News:

తెలంగాణ ఉద్యోగుల జీతాల్లో కోత‌ల శాతం ఇలా..

ఇప్ప‌టి వ‌ర‌కు 10 ల‌క్ష‌ల మందికి క‌రోనా టెస్టులు పూర్తి

Latest Updates