ఆఫీసులు.. బ్యాంకులు తెర‌వ‌ట్లే

డాక్టర్లకూ వైరస్..సర్కారు వైద్యసేవలపై ఎఫెక్ట్
పబ్లిక్ నుంచి స్టాఫ్ కు..వాళ్ల నుంచి పబ్లిక్ కు
ఎక్కడా కానరాని శానిటైజర్లు, ఫిజికల్ డిస్టెన్స్

(వెలుగు, నెట్ వ‌ర్క్): జిల్లాల్లోఆఫీసులు, బ్యాంకులు, హాస్పిటళ్లు, పోలీస్ స్టేషన్లు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నయ్. వివిధ పనుల కోసం వస్తున్న పబ్లిక్, చెకప్ కోసం వస్తున్న పేషెంట్స్ ఎక్కడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తలేరు. లాక్ డౌన్ సడలించాక కొత్తలో నాలుగైదు రోజులు ఆఫీసులు, బ్యాంకుల ముందు సబ్బులు, శానిటైజర్లు అంటూ హడావిడి చేసిన ఉన్నతాధికారులు తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో డాక్టర్లు, ఆఫీసర్లు, స్టాఫ్ కరోనా బారిన పడుతున్నారు. పబ్లిక్ నుంచి వాళ్లకు సోకడమే కాదు, వాళ్లనుంచి కూడా పబ్లిక్ కు సోకుతుండడంతో అన్ని జిల్లాల్లో ఆందోళన మొదలైంది. కొన్నిచోట్లఏకంగా ఆఫీసులు, బ్యాంకులను మూసివేయాల్సిన పరిస్థితి వస్తోంది.

ఆఫీసులు, ఠాణాలకు తాళాలు..

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆంధ్రా బ్యాంకు మేనేజర్ కు పాజిటివ్ వచ్చింది. ఆయన ఫ్యామిలీ, బ్యాంకులో పనిచేస్తున్న స్టాఫ్ తో కలిపి10 మందికి సోకింది. దీంతో వారం పాటు బ్యాంకును మూసి ఉంచారు. ఇదే పట్టణంలోని పోస్ట్ మాస్ట‌ర్ కు కరోనా రావడంతో పోస్టాఫీసును రెండురోజులుగా మూసి ఉంచారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఎస్ ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డ్ కు కరోన పాజిటివ్ రాగా స్టేషన్ లో పని చేస్తున్న సుమారు 17 మందినికి హోంక్వారంటైన్ చేశారు. స్టేషన్ మొత్తం ఖాళీ కావడంతో మరో ఠాణాకు ఇన్ చార్జి ఇచ్చారు. మెదక్ జిల్లా పోలీస్ ఆఫీస్ ఐటీ కోర్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు ఇటీవల కరోనా పాజిటివ్ రాగా, ఒక రోజు ఆఫీస్ ను పూర్తిగా మూసి వేశారు. కాగజ్ నగర్ టౌన్ లో తహసీల్దార్ ఆఫీస్ లోకి ప్రజలను అనుమతించడం లేదు. ఆఫీస్ ముందు తాళ్లతో కట్టి గేట్ క్లోజ్ చేశారు. యాదాద్రి జిల్లా పరిషత్ సీఈఓ, ఆలేరులోని కో అపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి, భువనగిరిలోని కెనరా బ్యాంకు ఉద్యోగికి పాజిటివ్ రావడంతో గవర్నమెంట్ ఆఫీసుల్లో డ్యూటీ అంటేనే ఆఫీసర్లు, స్టాఫ్ భయపడుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల ఎస్ బీఐ బ్యాంకు మేనేజర్ కు కరోనా సోకగా వారం పాటు బ్యాంకును మూసి వేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆర్డీఓర్డీతో పాటు ఎన్టీపీన్టీ సీలో ఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది.

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట తహసీల్దార్‍ ఆఫీ సుకు ఇటీవల కరోనా పాజిటివ్ వ్యక్తి వచ్చాడు. దీంతో ఆర్‍ఐ, ఇద్దరు వీఆర్వోలు, ఇద్దరు వీర్‍ఆర్ఏలు హోంక్వా రంటైన్ లోకి వెళ్లి , ఎమ్మార్వో ఆఫీస్‍ మెయిన్‍ గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు ఎస్సైలు సహా తొమ్మిది మందికి పాజిటివ్ రావడంతో ఠాణా వెలవెలబోతోంది. మహబూబాబాద్ లో మున్సిపాలిటీ శానిటరీ ఇన్ స్పెక్ట‌‌ర్ ఆర్టీఏర్టీ కార్యాలయంలో ఏజెంట్ కు, డోర్నకల్ పోలీసు స్టేషన్లో కానిస్టేబు ల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో డ్యూటీలకు వచ్చేందుకు స్టాఫ్ జంకుతున్నారు. వనపర్తి జిల్లా లోని ఓ తహసీల్దార్, ఫారెస్ట్ఆఫీసర్కు, పలువురు బ్యాంకు సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వీరి ప్రైమరీ కాంటాక్టులనూ హౌస్ క్వారంటైన్ చేశారు.

ఆసుపత్రుల్లో నిలుస్తు న్న వైద్యసేవలు..

ఖమ్మం పెద్దాసుపత్రిలో నలుగురు డాక్టర్లు, నలుగురు నర్సులు, మరో ఐదుగురు స్టాఫ్ కు పాజిటివ్వచ్చింది. వీరంతా క్వారంటైన్ లో ఉండగా, కరోనా భయంతో మరో ముగ్గురు డాక్టర్లు డ్యూటీకి రావడం లేదు. దీంతో హాస్పిటల్లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. వరంగల్ ఎంజీఎంలో సుమారు 46 మంది వైద్య సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. ఎంజీఎంలో పని చేసే 13 మంది హౌస్ సర్జ‌న్ తో పాటు 33 మంది జూడాలకు కరోనా సోకింది. వీరంతా కేఎంసీ ఐసోలేషన్ లో ఉండగా, మిగిలిన స్టాఫ్ పై భారం పడుతోంది. మహబూబ్ నగర్ జిల్లా పెద్దాసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు, కోవిడ్ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీఏంహెచ్ ఓ తోపాటు ఒక నర్సు, డాటా ఏంట్రీ ఆపరేటర్ కు కరోనా వచ్చింది. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ పనిచేసే పిల్లల డాక్ట‌ర్ కు పాజిటివ్ రావడంతో ఆ వింగ్ లో సేవలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రిలో ఒక డాక్ట‌ర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు స్టాఫ్ నర్సులకు, వనపర్తి జిల్లాలోని ఖిల్లా గణపురం పీహెచ్ సీ లోని డాక్ట‌ర్ తో పాటు ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయా దవాఖాన్ల‌ల్లో వైద్యసేవలపై ఎఫెక్ట్ పడుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates