నిరవ్ మోడీ కేసుపై కరోనా ఎఫెక్ట్

  • మన దేశానికి తీసుకురావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13 వేల కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీని స్వదేశానికి రప్పించడం మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు మనదేశంతోపాటు లండన్ లో లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఆ ప్రభావం ఈ కేసు విచారణపై పడే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మే 11 నుంచి వాదనలు వింటామని గత విచారణలో వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు చెప్పింది. ‘ఈ నెల 28న కేసుల విచారణ ఉంది. లాక్ డౌన్ ఉన్నందున మన టీమ్స్ లండన్ కు వెళ్లడం సాధ్యం కాదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని కోరతాం. కోర్టు ఏం చెబుతుందో చూడాలి’ అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో నిరవ్ మోడీ ఉన్నాడు. నిరవ్ మోడీని అప్పగించాలని సీబీఐ, ఈడీ ఇంగ్లండ్ అధికారులను కోరాయి. నిరవ్ మోడీ తన అనురచుల మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే చంపేస్తానని బెదిరించినట్లు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ద్వారా మన దర్యాప్తు సంస్థలు అభియోగాలు పాయి. వీటిపై ఈ నెల 28న జరిగే విచారణలో కోర్టు తీర్పు చెప్పే అవకాశం ఉంది. మే 11 నుంచి మొదలయ్యే విచారణలో నిరవ్ మోడీని ఇండియాకు అప్పగించే అంశంపై వాదనలను విననుంది.

Latest Updates