కరోనా ఎఫెక్ట్: చికెన్‌కు నో… ఓన్లీ మటన్, ఫిష్ అంటున్న జనం

కరోనా ఎఫెక్ట్ నాన్ వెజ్ ప్రియులపై ఎఫెక్ట్ చూపిస్తోంది. కరోనా వార్తలు వచ్చినప్పటి నుంచి చికెన్ తినడం బంద్ పెట్టారు జనం. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో చికెన్ వైపు చూడటమే మానేశారు. దీంతో మటన్ కు గిరాకీ పెరిగింది. సీ ఫుడ్ కు ఎక్కువగా ప్రయార్టి ఇస్తున్నారు సిటీ జనం. ఆదివారం ఫుల్ రష్ గా ఉండే.. నాన్ వెజ్ మార్కెట్లు ఇవాళ కళ తప్పాయి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై తగు చర్యలు తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్కూల్లు, కాలేజీలు, సినిమా థియేటర్లను బంద్ చేసింది ప్రభుత్వం. వారంపాటు థియేటర్లను బంద్ చేయడంతో సినిమా హాల్స్ దగ్గర సందడి లేకుండా పోయింది. ప్రేక్షకులతో ఎప్పుడూ సందడిగా ఉండే RTC క్రాస్ రోడ్స్ కల తప్పింది.

Latest Updates