వర్క్​ ఫ్రం హోం ఎఫెక్ట్.. 12 దాటాకే నిద్రపోతున్నరు

బెంగళూరు: కరోనా వైరస్​ ప్రభావం ఇండియన్స్​ నిద్రపైనా పడింది. లాక్​ డౌన్​ కారణంగా ఆఫీసులకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది వర్క్​ ఫ్రం హోం చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది స్లీప్​ టైమింగ్​ ఒక్కసారిగా మారిపోయాయని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. బెంగళూరుకు చెందిన మ్యాట్రెస్​ల తయారీ సంస్థ వేక్​ఫిట్​ కరోనా నేపథ్యంలో స్లీప్​ ప్యాట్రన్లపై ఇటీవల ఓ ఆన్​లైన్​ సర్వే నిర్వహించింది. దాదాపు 1,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇంట్లోనే ఉండటం.. వర్క్​ ఫ్రం హోం చేస్తుండటంతో తాము నిద్రపోయే టైమింగ్సే మారిపోయాయని మెజారిటీ జనం అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మందికిపైగా ఇదే మాట చెప్పారు. లాక్​ డౌన్​ వల్ల రాత్రి 11 గంటల కంటే ముందు నిద్రపోతున్నామని 46 శాతం మంది చెప్పారు. లాక్​ డౌన్​కు ముందు ఈ సంఖ్య 39 మాత్రమే. ఇక అర్ధరాత్రి దాటాక నిద్రపోయే వారి సంఖ్య లాక్​ డౌన్​కు ముందు 25 శాతం ఉంటే.. ఇప్పుడు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నిద్రపోయే వారి సంఖ్య 35కు పెరిగింది. అంటే లేట్​ నైట్​ తర్వాత నిద్రపోయే వారి సంఖ్య లాక్​ డౌన్​ వల్ల దాదాపు 40 శాతం పెరగడం విశేషం. ఒకసారి లాక్​డౌన్​ ఎత్తేస్తే తమ స్లీప్​ షెడ్యూల్​ మళ్లీ నార్మల్​కు వస్తుందని 81 శాతం మందికిపైగా సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు.

Latest Updates