చిరు వ్యాపారులపై కరోనా ఎఫెక్ట్

చేస్తున్న పనితోపాటు అదనంగా మరొకటి
కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు అవస్థలు

పొద్దుగాల నుంచి చీకటి పడేదాక కూరగాయలు అమ్మితే 500 వచ్చేయి. కరోనాతో ఇప్పుడు గిరాకీ బాగా తగ్గింది. పక్కనే ఇంకోటి పెట్టు కుని పండ్లు అమ్ముతున్నా. కొంత ఆదాయం తోడవడంతో ఇల్లు గడిచేందుకు కొంచెం ఆసరా దొరికింది” ఫిలింనగర్ కు చెందిన చిరు వ్యాపారి సయ్యద్ చెప్పిన మాటలివి. “గుడి ముందు పూలు అమ్ముతుంటాను. లాక్ డౌన్ తో గుడి బంద్ పెట్టడం వల్ల ఇల్లు గడిచేందుకు కూరగాయలు తెచ్చి అమ్ముతున్నాను. అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. గుడి ఓపెన్ అయినా భక్తులు పెద్దగా వస్తలేరు. దాంతో రెండు బండ్లు పెట్టుకుని కూరగాయలు, పూలు అమ్ముతున్నట్లు తెలిపింది మమత.

హైదరాబాద్, వెలుగు: కరోనా దెబ్బతో చిరువ్యాపారులు డీలా పడిపోయారు. లాక్ డౌన్ కారణంగా పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా భయంతో రోడ్ సైడ్ ఏదైనా కొ నాలంటేనే జనం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి కూరగాయల వరకు ఏది కావాలన్నా సూపర్ మార్కెట్స్, ఆన్లైన్ వైపే మొగ్గుచూపుతున్నారు. దాంతో చిరు వ్యాపారాలకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. శానిటైజర్ వాడుతున్నా, మాస్క్ లు పెట్టుకుంటున్నా జనం పెద్దగా రావడం లేదని పలువురు వాపోతున్నారు. దాంతో చేస్తున్న పనికి తోడుగా మరో వ్యాపారం పెట్టుకుంటున్నారు. అలా వచ్చే ఆదాయంతో కుటుంబాలు నెట్టుకొస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

 

Latest Updates