స్పోర్ట్స్ ఈవెంట్లపై కరోనా ఎఫెక్ట్

రిస్క్ లేకుంటేనే స్పోర్ట్స్ ఈవెంట్లు
ఆగస్టులో రీస్టార్ట్ చేయాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆలోచన
జాగ్రత్తగా వ్యవహరించాలని క్రీడాకారుల మనోగతం
న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి క్రీడా రంగం ఇప్పుడిప్పుడే కో-లుకుంటోం ది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌గా పలు స్పో ర్ట్స్‌ ఈవెంట్లు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అవుతున్ నాయి. ఖాళీ స్టేడియాల్లో ఫుట్‌బాల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ లు జరుగుతున్నాయి. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌–వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌తో జులై 8 నుంచి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌ రీస్టార్ట్‌‌‌‌‌‌‌‌ కానుంది. యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌తో టెన్నిస్‌‌‌‌‌‌‌‌ కూడా తిరిగి మొదలవనుం ది. ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా స్పో ర్ట్స్‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌ను మళ్లీ మొదలు పెట్టేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను అనుమతిం చకుం డా ఆగస్టు నుంచి పోటీలు మొదలెట్టాలని భావిస్తున్నట్టు నేషనల్‌‌‌‌‌‌‌‌ స్పో ర్ట్స్‌ ఫెడరేషన్స్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులతో లాస్ట్‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌ జరిగిన వర్చువల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌లో సెంట్రల్‌‌‌‌‌‌‌‌ స్పో ర్ట్స్‌ మినిస్ట ర్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌ రిజిజు తెలిపారు. దాంతో, ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ కమ్‌ కాంపిటీషన్‌‌‌‌‌‌ క్యాలెండర్స్‌‌‌‌‌‌‌‌ ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ (ఐఓఏ) రెడీగా ఉంది. మరి, క్రీడాకారుల పరిస్థితి ఏంటి? పోటీలు మొదలెడితే పాల్గొనేం దుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారా? దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుం డగా రిస్క్‌‌‌‌‌‌‌‌ తీసుకొని గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో కి వస్తారా?. ఈ ప్రశ్నలను వివిధ ఆటల్లోని పలువురు టాప్‌ ప్లేయర్ల ముందుంచి తే భిన్ నాభిప్రా యాలు వ్యక్తం చేశారు. ప్రాణాలకు రిస్క్‌‌‌‌‌‌‌‌ లేనప్పుడే స్పోర్స్‌ట్ ను రీస్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని అందరూ చెప్పారు. ‘టోర్నీల రీస్టార్ట్‌‌‌‌‌‌‌‌ గురించి మాట్లా డాలంటే ముందుగా వైరస్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో కి రావాలి. ఇండియాలో కేసుల సంఖ్య తగ్గుతుందా ? వైరస్‌‌‌‌‌‌‌‌కు మందులు కానీ, వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ కానీ వచ్చేలా ఉందా? అంటే సమాధానం లేదు. మరి, ఇలాంటి టైమ్‌ లో కాం పిటీషన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహి స్తే ఎలా? ఒకవేళ అథ్లెట్లకు వైరస్‌‌‌‌‌‌‌‌ సోకితే, మరెందరి- నో ప్రమాదంలోకి నెడితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? కాబట్టి ఈ టైమ్‌ లో జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ప్రాణాల గురించి ఆలోచించాలి’ అని ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌ విజేందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. కానీ, అథ్లెట్లు ఇంకెం త కాలం తమ ఇళ్లు, హాస్టల్‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌కు పరిమితం కావాలి అని ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అవుతున్న రెజ్లర్‌‌‌‌‌‌‌‌ బజ్‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌ పునియా అంటున్నాడు.‘లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ మొదలైనప్పటి నుంచి అథ్లెట్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పరిస్థితిని ఇలానే ఉంటే వాళ్లు చాలా నష్టపోతారు. ఫిట్‌ నెస్‌‌‌‌‌‌‌‌ కోల్పోతారు. దాని ప్రభావం దారుణంగా ఉంటుంది’ అని బజ్‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌ అంటున్నాడు. కానీ, కేసుల సంఖ్య పెరుగుతున్న ఈ టైమ్‌లో ఆటలు ప్రారంభించలేమని అంగీకరించాడు.
ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ స్టా ర్ట్ చేయకపోతే లాస్‌‌‌‌‌‌‌‌: కశ్యప్‌ , ప్రణీత్
సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి టోర్నీలు రీస్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసేం దుకు బ్యా-డ్మిం టన్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఫెడరే షన్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే క్ యాలెం డర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయకపోతే తాము చాలా లాస్ అవుతామని ఇండియా షట్లర్లు అంటున్ నారు . ‘మళ్లీ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసి కాంపిటీషన్లలో పాల్గొనేం దుకు రెడీ అవ్వాలని నేను కోరుకుంటున్నా. కానీ, వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి వచ్చేం త వరకూ అది జరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేదు’ అని వెటరన్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పారుపల్లి కశ్యప్‌ అన్నాడు. అయితే, మరో స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లే యర్‌‌‌‌‌‌‌‌ బి. సాయి ప్రణీత్‌‌‌‌‌‌‌‌ కాస్త భిన్నం గా స్పందించాడు. ‘ఈ టైమ్‌ లో టోర్నీలు జరగకపో- యినా మాకు ప్రాబ్లం లేదు. కానీ, బీడబ్ల్ యూఎఫ్‌ క్యాలెం డర్‌‌‌‌‌‌‌‌ ప్రకారం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో పోటీలు స్టార్టవుతాయి. లాం గ్ బ్రేక్‌‌‌‌‌‌‌‌ తర్వాత పోటీకి రెడీ అవ్వా లంటే కనీసం ఒకటిన్నర నెలల టైమ్‌ పడుతుం ది. కాబట్టి జులై నుంచే మేం ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించాల్సి ఉంటుంది’ అని అభిప్రాయపడ్డాడు. ఇక, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ లెవెల్లో కాం పిటీషన్లు మొదలైతే వాటిలో పాల్గొనడం తప్ప తమకు మరో ఆప్షన్‌‌‌‌‌‌‌‌ ఉండబోదని స్టార్‌‌‌‌‌‌‌‌ వెయిట్‌ లి ఫ్ట ర్‌‌‌‌‌‌‌‌ మీరాబాయి చాను అంటోంది. ఒలిం పిక్స్‌‌‌‌‌‌‌‌ కోర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌ షూటర్లకు నేషనల్‌‌‌‌‌‌‌‌ క్యాం ప్‌ ని-ర్వహించాలని రైఫిల్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. పోటీలు కూడా ప్రారంభించాలన్న అభిప్రా యాలు వస్తున్నా షూటర్లు మాత్రం తొందర వద్దంటున్నారు. ట్రెయినిం గ్ మాత్రం స్టార్ట్ చేయొచ్చని సంజీవ్ రాజ్ పుత్, అభిషేక్ వర్మ అభిప్రాయపడ్డారు.

బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌ కష్టమే!
జులై 1 నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించాలని ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసిన బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సింధు, సైనా వంటి టాప్‌ షట్లర్లు నగరంలోనే ఉండడంతో బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (బాయ్‌‌‌‌‌‌‌‌) భాగ్యనగరంలో దీన్ని నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే గోపీచంద్‌‌‌‌‌‌‌‌ అకాడమీలోనే జరిగే చాన్సుంది. అయితే, నగరంలో వైరస్‌‌‌‌‌‌‌‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనాను కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు సిటీలో 15 రోజుల పాటు లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో, ఈ క్యాంప్‌ జరగడం దాదాపు అసాధ్యం అనిపిస్తోంది. అదే జరిగితే ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న షట్లర్లకు మరికొంత నిరీక్షణ తప్పదు.

Latest Updates