160 కోట్ల మంది విద్యార్థుల చదువులపై కరోనా ప్రభావం: ఆంటోనియా గుటెరస్

ఎడ్యుకేషన్ సిస్టమ్ పై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని  ఐక్యరాజ్యసమితి తెలిపింది.  ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ ఇవాళ(మంగళవారం) ఎడ్యుకేషన్ అండ్ కోవిడ్-19 అంశంపై వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది విద్యార్థుల చదువులపై కరోనా తీవ్రమైన ప్రభావాన్ని చూపిందన్నారు. అలాగే రెండున్నర కోట్ల మంది పాఠశాల విద్యార్థులు డ్రాపౌట్ లుగా మారే ప్రమాదం ఉందన్నారు. నాలుగు కోట్ల మంది చిన్నారులు ప్రీస్కూల్ అకాడమిక్ ఇయర్ ను  కోల్పోయిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

 

Latest Updates