కరోనాతో దునియా షేకింగ్: నష్టాల్లో చిన్నా, పెద్ద వ్యాపారాలు

మెడికల్స్​ మినహా ఇటలీలో ఇక అన్నీ బంద్​

గ్రీస్​, ఆస్ట్రియా దేశాల్లో కూడా కరోనా మృతులు

మన దేశంలో 74కి పెరిగిన కొవిడ్​ బాధితులు

వేరే దేశాలకు పోవొద్దని మంత్రులకు ప్రధాని ఆదేశం

ఆందోళన పడొద్దని ప్రజలకు మోడీ సూచన

4,700 దాటిన కొవిడ్​ మరణాలు

ప్రపంచం చుట్టూ కరోనా గోడ కట్టేసింది. దేశాల మధ్య ‘ఐసోలేషన్​’ గీత గీసేసింది. చైనాలో మొదలైన కరోనా డేంజర్​ జర్నీ, ఆగకుండా దునియా మొత్తాన్ని చేరింది. సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. వ్యాపారాలను కుదేలు చేస్తోంది. ఎకానమీలని దెబ్బ తీస్తోంది. వైరస్​ సోకిన దేశాలే కాదు, సోకని దేశాలనూ ఇబ్బంది పెడుతోంది. పెద్ద వ్యాపారాలే కాదు, చిన్న చితకా వ్యాపారాలు చేసుకునేటోళ్లపైనా అది పెద్ద దెబ్బే వేసేసింది. అందుకే డబ్ల్యూహెచ్​వో దానిని ప్యాండెమిక్​గా ప్రకటించింది. వెంటనే అన్ని దేశాలూ అలర్ట్​ అయిపోయాయి. ఎక్కడికక్కడ లాక్​డౌన్​ప్రకటించేశాయి.

అమెరికాతో సహా కొన్ని దేశాలు వేరే దేశపోళ్లకు ఎంట్రీలను ఆపేశాయి. ట్రావెల్​ బ్యాన్​లు విధించేశాయి. ఎయిర్​లైన్స్​ సంస్థలు విమానాలను రద్దు చేశాయి. ఆ ప్రభావం ఇండియా సహా వివిధ దేశాల టూరిజంపై బాగానే పడింది. కేరళ, కాశ్మీర్​ వంటి చోట్ల టూరిస్టుల సంఖ్య బాగా పడిపోయింది. దాల్​ లేక్​లో బోట్లు ఒడ్డునే నిలిచిపోయాయి. తినే తిండినీ కరోనా వదల్లేదు. మాంసానికి దానికి సంబంధం లేకున్నా, మాంసం తింటే వైరస్​ అంటుతుందన్న పుకార్లు నమ్మి జనాలు చికెన్​ కొనకపోవడంతో దేశంలో పౌల్ట్రీ ఇండస్ట్రీ దెబ్బతింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో చికెన్​ రేట్లు దారుణంగా పడిపోయాయి.

దేశంలో కరోనా  కేసుల సంఖ్య 74కి పెరిగింది. మంత్రులెవరూ వేరే దేశాలకు పోవొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. జనాలు గావరా పడొద్దని, ప్రభుత్వం అలర్ట్​గానే ఉందని చెప్పారు. రాష్ట్రపతి భవన్​కు విజిటర్లను నిషేధించారు. వివిధ దేశాలకు ఇచ్చే వీసాలను సస్పెండ్​ చేశారు. ఢిల్లీలో థియేటర్లు, స్కూళ్లు బంద్​ అయ్యాయి. గ్రీస్​, ఆస్ట్రియా దేశాల్లో కరోనా కారణంగా గురువారం తొలి మరణాలు నమోదయ్యాయి. ఇటలీ ఇప్పటికే లాక్​డౌన్​ అయిపోయింది. ఆ లాక్​డౌన్ ​ఇప్పుడు రెస్టారెంట్లు, స్టోర్లు, సెలూన్లు అన్నింటికీ చేరింది. అక్కడ ఎయిర్​పోర్టుల్లో వందలాది ఇండియన్లు చిక్కుకుపోయారు.

Latest Updates