కరోనా దెబ్బకు పొల్యూషన్​ దిగొచ్చింది!

కరోనా కారణంగా సిటీలకు సిటీలనే లాక్​ డౌన్​ చేయడం, ఫ్యాక్టరీలను మూసేయడంతో చైనా, సౌత్​ కొరియా, ఇటలీల్లో పొల్యూషన్​ ఒక్కసారిగా తగ్గిపోయింది. కాలుష్యానికి మారుపేరుగా ఉండే చైనాలోని బీజింగ్​, చెంగ్డూ ప్రాంతాల్లోనూ గాలి కాస్త శుభ్రంగా మారింది. అమెరికాకు చెందిన సెంటినల్​–5పి శాటిలైట్​ తీసిన చిత్రాలను అక్కడి డెస్కర్ట్స్​ ల్యాబ్స్​ విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించింది.

ఫ్యాక్టరీలు, వెహికిల్స్​ నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి వంటివి ఆగిపోవడమే కారణమని పేర్కొంది. ఈ ప్రాంతాల ఏడాది కిందటి, ప్రస్తుత మ్యాప్ లను విడుదల చేసింది. కాలుష్యం పెరగడమే తప్ప.. ఇలా తగ్గడాన్ని జీవితంలో చూస్తామనుకోలేదని ఇటలీ బకోని వర్సిటీ నిపుణుడు మార్కో కామెంట్​ చేశారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates