సింపుల్‌గా శ్రీకృష్ణాష్ట‌మి..

వెలుగు, నెట్‌వర్క్‌: రాష్ట్ర‌‌‌వ్యాప్తంగా మంగళవారం కృష్ణాష్టమి సంబురాలను సింపుల్‌‌గా జరుపుకున్నారు. ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే ఈ వేడుకలను కరోనా నేపథ్యంలో ఎలాంటి అట్టహాసాలు లేకుండా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల ను ఇళ్ల‌లోనే కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలంకరించి ఫొటోలను సోషల్ ‌మీడియాలో పోస్టులు పెట్టుకుని మురిసిపోయారు. జన్మాష్టమి సందర్భంగా బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణుల విగ్రహాలకు అభిషేకం చేశారు పూజారులు. కరోనా కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. ప‌లు కృష్ణ ఆలయాల‌ల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యం లో సామాజిక దూరాన్ని పాటిస్తూ భగవద్గీత పారాయణం చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. పలు గ్రామాలు, తండాల్లో గిరిజనులు వారి సంప్రదాయంగా వేడుకలు నిర్వహించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates