కరోనా సాకు చూపి… ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ పై నిరసన

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో సీవరేజీ ప్లాంట్‌ ను పరిశీలిం చి మాట్లా డారు. పనులు ప్రారంభించి పుష్కరం దాటినా ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉన్న ఆఫీసర్లు పట్టిం చుకోవడం లేదన్నారు. ఇప్పటికే సుమారు రూ. 70 కోట్లు కేటాయించినా, కేవలం పైప్‌ లైన్ల నిర్మాణంతోనే సరిపెట్టారన్నారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్ మల్లేశ్‌, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, చంద్ర, రవినాయక్ ఉన్నారు.

Latest Updates