ఏపీలో కరోనా ఐ మాస్క్ బస్సులు ప్రారంభం

విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో కరోనా ఐ మాస్క్ బస్సులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలో తొలివిడతలో 72 కోవిడ్ టెస్ట్ బస్సులను రవాణా శాఖ సిద్ధం చేసింది. ఈ బస్సుల్లో ప్రతిరోజు ప్రజల వద్దకే వెళ్లి కరోనా టెస్ట్ లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని చెప్పారు.

కృష్ణా జిల్లాలో 22, గుంటూరులో 13, చిత్తూరులో 7,  కడపలో 3, కర్నూలులో 11,  అనంతపురంలో 12, పశ్చిమగోదావరి జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 2 బస్సులు సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ టెస్టులు వేగవంతం చేసేందుకు ఐ మాస్క్ బస్సులు ఉపయోగిస్తామని ఈ సందర్భంగా మంత్రి ఆళ్లనాని తెలిపారు. ప్రతీ బస్సులో రోజుకు 200 మంది వరకూ కోవిడ్ టెస్టులు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్.డి.డి. కిట్ ల ద్వారా చేసిన టెస్ట్ ల వల్ల అరగంటలో ఐదుగురి రిజల్ట్స్ ఇస్తామన్నారు. ట్రూ నాట్ కిట్స్ ద్వారా 24 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

Latest Updates