కరోనా భయంతో కరెన్సీ నోట్ల కాల్చేసిన్రు

శివాజీ నగర్ : కరోనా వైరస్ ఎఫెక్ట్ తో జనానికి డబ్బు మీద ఆశ కూడా చచ్చిపోతోంది. అంతలా ఉంది ఈ వైరస్ ప్రభావం. రోడ్డుపై పడి ఉన్న కరెన్సీ నోట్లపై ఎవరో ఉమ్మి వేశారన్న అనుమానంతో జనం వాటిని కాల్చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని కల్గూరి జిల్లా సుంటనురు అనే గ్రామంలో చోటు చేసుకుంది. ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్న కొంతమంది వ్యక్తులు ఉమ్మి వేసిన నోట్లను అక్కడ పారేసినట్లు స్థానిక మహిళలు తెలిపారు. వెంటనే ఆ నోట్లపై మట్టి పోసి ఎవరూ ముట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ పెద్దలు అక్కడికి వచ్చి ఆ నోట్లను కాల్చేశారు. ఎవరో కావాలనే కరోనా అంటించేందుకు ఇలా చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. కరెన్సీ నోట్ల ద్వారాను కరోనా వ్యాపించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Latest Updates