వృద్ధాశ్రమంలో 20 మందికి కరోనా

పని మనుషులోనే వచ్చిందా అని అనుమానం

కరీంనగర్ జిల్లాలోని మరో మూడు ఆశ్రమాల్లో స్క్రీనింగ్

కరీంనగర్, వెలుగు: అక్కడ ఉండేవాళ్లు అందరూ వృద్ధులు. చాలామంది 70 నుం చి 80 ఏళ్లకు పైబడిన వారే. అయినవారి ఆదరణ కరువై వృద్ధాశ్రమానికి చేరారు. కానీ కరోనా కాలంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నిర్వాహకులు నిర్లక్ష్యం ప్రదర్శిం చారు. దీంతో 20 మందికి కరోనా వైరస్‌‌ సోకింది.కరీంనగర్ లో ఉన్న వాసవి వృద్ధాశ్రమంలో 20 మందికి వైరస్ సోకడానికి కారణం అక్కడ పని చేసే వాళ్లేనని తెలుస్తోంది. ఆశ్రమంలో వృద్ధులకు చాయ్, టిఫిన్లు అందించే ఓ వ్యక్తి పది రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరం, దగ్గు వంటి ఉండటంతో ఆశ్రమానికి రావద్దని నిర్వాహకులు సూచిం చినట్లు తెలిసింది. తర్వాత టెస్టుల్లో అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతని ద్వారానే ఆశ్రమంలో ఉన్నవారికి వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సివిల్ హాస్పిటల్ కు తరలింపు

వాసవి ఆశ్రమంలో ఇప్పటికే ఇద్దరు వృద్ధులు చనిపోయారు. అక్కడ పని చేసే వ్యక్తికి వైరస్ సోకిందని తెలిసి వైద్య అధికారులు ఆశ్రమానికి  చేరుకుని ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేపట్టారు. 20 మందికి పాజిటివ్ రావడంతో అందరిని జిల్లా సివిల్ హాస్పి టల్ కు తరలించారు. నెగటివ్ వచ్చిన వృద్ధులను వారి పిల్లలు వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. సివిల్ ఆసుపత్రిలోనూ కేసులు ఎక్కువ రావడంతో బెడ్లు సరిపోవడం లేదు. దీంతో చిన్న పిల్లల వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. నగరంలో ఉన్న మరో రెండు ఆశ్రమాల్లో 87 మంది వృద్ధులకు స్ర్కీనిం గ్ చేసి.. ర్యాపిడ్ టెస్టులు చేశారు. ఇందులో ఎవరికి పాజిటివ్ రాలేదు.దీంతోపాటు ఇల్లందకుంటలో ఓ ఆశ్రమంలో 39 మందికి  స్క్రీనింగ్ చేశారు.

 

Latest Updates