పెళ్లికెళ్లిన‌ 95 మందికి క‌రోనా

క‌రోనా టైంలో పెళ్లిళ్లు ప్రాణాల మీద‌కు తెస్తున్నాయి. బిహార్ పాలిగంజ్ కు చెందిన ఓ వ్య‌క్తికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నా.. జూన్ 15న వివాహం చేసుకున్నాడు. పెళ్లైన 2 రోజుల‌కే అత‌డు ప్రాణాలు కోల్పోయాడు. వెంట‌నే అల‌ర్ట్ అయిన‌ అధికారులు.. ద‌గ్గ‌రి బంధువులకు టెస్టులు చేయగా..15 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత పెళ్లికి వ‌చ్చిన అంద‌రికీ ప‌రీక్ష‌లు చేయ‌గా 80 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. వీరి ద్వారా మ‌రెంత మందికి క‌రోనా సోకిందోన‌ని బంధువులు, స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు.