ఏడేళ్ల బాలుడిని, అతని తండ్రిని గాంధీ ఆస్పత్రికి తరలింపు

ఓ ఏడేళ్ల బాలుడికి  కరోనా సోకింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన వ్యక్తి  గత నెల   స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్థకు చెందిన అతిథి గృహంలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలడంతో ఇంటికెళ్లాడు. ఈ నెల 5, 6 తేదీల్లో అతడి ఏడేళ్ల కుమారుడు జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానించి పరీక్షలు చేయించగా   కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చిన్నారితోపాటు, అతడి తండ్రిని కూడా అధికారులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలోని మిగతా నలుగురి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం వారంతా పటాన్‌చెరులోని ఐసోలేషన్ సెంటర్ లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Latest Updates