పాక్‌ టీమ్‌లో ముగ్గురికి కరోనా

ఇంగ్లండ్‌‌ టూర్‌‌పై నీలినీడలు

కరాచీ: పాకిస్థాన్‌‌ క్రికెట్‌‌లో కరోనా అలజడి రేగింది. పాక్‌‌ నేషనల్‌‌ టీమ్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. హైదర్‌‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌‌, హారిస్‌‌ రౌఫ్‌‌కు పాజిటివ్‌‌గా తేలినట్టు పాక్‌‌ క్రికెట్‌‌ బోర్డు (పీసీబీ) సోమవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌ టూర్‌‌ నేపథ్యంలో ఆదివారం రావల్పిండిలో నిర్వహించిన పరీక్షల్లో వీరికి వైరస్‌‌ నిర్ధారణ అయిందని తెలిపింది. దాంతో, ఆ జట్టు ఇంగ్లండ్‌ టూర్‌‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టెస్టులు చేసేవరకు ముగ్గురు ఆటగాళ్లలో లక్షణాలే కనిపించలేదని పీసీబీ చెప్పింది. ఈ ముగ్గురినీ సెల్ఫ్‌‌–క్వారంటైన్‌‌కు వెళ్లాలని ఆదేశించింది. వీరితో పాటు ఇమాద్‌ వసీం, ఉస్మాన్‌‌ షిన్వారి కూడా టెస్టులకు హాజరవ్వగా… నెగిటివ్‌‌ అని తేలింది. షోయబ్‌మాలిక్‌‌,వకార్‌‌ యూనిస్‌‌, క్లిఫ్‌‌ డీకన్‌‌ మినహా ఇతర ప్లేయర్లు, టీమ్‌ అఫీషియల్స్‌‌ అంతా కరాచీ, లాహోర్‌‌, పెషావర్‌‌లోని సెంటర్లలో సోమవారం కరోనా టెస్టులకు హాజరయ్యారు. మంగళవారం రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తాము నిర్వహించిన మాస్ టెస్టింగ్‌‌ లో ఏడుగురికి వైరస్‌‌ సోకినట్టు తేలిందని క్రికెట్‌‌ సౌతాఫ్రికా (సీఎస్‌‌ఏ) సోమవారం ప్రకటించింది. తమ సిబ్బంది, పలువురు నేషనల్, ఫ్రాంచైజీల ఆటగాళ్లుకలిపి మొత్తం వంద మందికి పైగా కరోనా టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌‌ వచ్చిందని సీఎస్‌‌ఏ తెలిపింది. వీరిలో క్రికెటర్లు ఉన్నారో లేరో మాత్రం చెప్పలేదు.

For More News..

మేడిన్‌ ఇండియా పుంజుకుంటోంది

ఉమెన్స్ టీ20 వరల్డ్‌‌కప్‌ రికార్డు

లాక్‌‌డౌన్ సడలించినా షాపింగ్ చేయట్లే..

Latest Updates