రాష్ట్రంలో మరో ముగ్గురికి కరోనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నెల 14న దుబాయ్ నుంచి వచ్చిన ఓ హైదరాబాదీకి, లండన్ నుంచి దుబాయ్ మీదుగా వచ్చిన మరొకరికి, నేరుగా లండన్ నుంచి వచ్చిన ఇంకొకరికి వైరస్ సోకినట్టుగా తేలిందని ఆరోగ్యశాఖ గురువారం రాత్రి ప్రకటించింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో కరోనా పేషెంట్ల సంఖ్య 16కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో ఒకరు ఈ నెల 14న శంషాబాద్‌‌ ఎయిర్‌‌ ‌‌పోర్టులో దిగి సికింద్రాబాద్‌‌లోని తన ఇంటికి వెళ్లారు. 17న జ్వరంతో గాంధీ హాస్పిటల్‌‌లో అడ్మిట్ అయ్యారు. దుబాయ్ మీదుగా వచ్చిన వ్యక్తి బుధవారం, లండన్ నుంచి వచ్చిన వ్యక్తి గురువారం గాంధీ హాస్పిటల్ లో చేరారు. ఈ పేషెంట్లతో కాంటాక్ట్ అయిన కొందరిని అధికారులు క్వారంటైన్ చేశారు. బాధితులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నరు.

ఒక్క రోజే 51 మందికి టెస్టులు

కరోనా బాధితులతో కాంటాక్ట్ అయినవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన పది మందిలో ఎనిమిది మందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. వీళ్లతో కరీంనగర్‌‌‌‌లో 40 మంది కాంటాక్ట్ అయినట్టు అధికారులు ఇప్పటి వరకు గుర్తించారు. ఇందులో కొందరిని ఇప్పటికే హైదరాబాద్‌‌ కు తరలించి ఐసోలేట్ చేశారు. ఇండోనేషియా టీమ్ ప్రయాణించిన రైల్వే కోచ్‌ లో తెలంగాణ వాళ్లు 16 మంది ఉండగా.. ఇందులో ఒకరిద్దరికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇంకా కాంటా క్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇండోనేషియా టీమ్ కాకుండా మిగతా పేషెంట్లతో 337 మందికిపైగా కాంటా క్ట్ అయినట్టు తేల్చారు. అందులో కొందరికి గురువారం టెస్టులు చేయించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. మొత్తంగా గురువారం 51 మందికి కరోనా టెస్టులు చేయగా.. 21 మందికి నెగిటివ్ వచ్చింది. ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మిగతా రిపోర్టులు రావాల్సి ఉంది.

క్వారంటైన్‌‌ కు 1,292 మంది

వివిధ దేశాల నుంచి గురువారం శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌ పోర్టులో దిగిన 711 మందిని క్వారంటైన్ సెంటర్లకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఇంతకుముందే విదేశాల నుంచి వచ్చిన మరో 581 మందిని సైతం క్వారంటైన్‌‌ సెంటర్లకు తరలించారు. పంజాగుట్ట గ్యాలరియా మాల్‌‌కు వైరస్ బాధితుడు కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఒకరు పంజాగుట్టలోని గ్యాలరియాలో మాల్‌‌ లో తిరిగినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వేరే రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి ఈ నెల 11న గ్యాలరియా మాల్‌‌ను సందర్శించాడని, ఆ రోజు మాల్‌‌కు వెళ్లినవాళ్లంతా సెల్ఫ్‌ క్వా రంటైన్‌‌లో ఉండాలని విజ్ఞప్తి చేసింది. జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే 104లో సంప్రదించాలని కోరింది.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates