క‌రోనా హాట్ స్పాట్స్ పై కేంద్రం దృష్టి: హైద‌రాబాద్ కు సెంట్ర‌ల్ టీమ్స్

దేశంలోని క‌రోనా హాట్ స్పాట్స్ పై కేంద్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు చెప్పారు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రెట‌రీ పుణ‌య స‌లీలా శ్రీవాస్త‌వ. ఇందుకోసం సెంట్ర‌ల్ టీమ్స్ పంపి క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను తెలుసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే ముంబై స‌హా ఆరు హాట్ స్పాట్స్ పంపి సీరియ‌స్ నెస్ అంచ‌నా వేసి.. కొన్ని స్ట్రాట‌జీల‌ను సూచించిచామ‌న్నారు. ఆరోగ్య శాఖ రోజువారీ ప్రెస్ మీట్ లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు.

క‌రోనా ప‌రిస్థితిపై క్షేత్ర స్థాయిలో అంచ‌నా వేసి ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉన్న ప్రాంతాల్లో కేంద్రం నుంచి మ‌రింత స‌హ‌కారం అందించేందుకు ఇంట‌ర్ మినిస్టీరియ‌ల్ సెంట్ర‌ల్ టీమ్స్ ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు‌. ఇప్ప‌టికే నియ‌మించిన ఆరు టీమ్స్ కు అద‌నంగా మ‌రో నాలుగు టీమ్స్ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ప‌రిస్థితి సీరియ‌స్ గా మారుతున్న హాట్ స్పాట్లు హైద‌రాబాద్, అహ్మ‌దాబాద్, సూర‌త్, చైన్నైల‌కు ఈ కొత్త టీమ్స్ ను పంపిన‌ట్లు చెప్పారు. లాక్ డౌన్ అమ‌లు తీరు, నిత్యావ‌రాల స‌ప్లైలో స‌మ‌స్య‌లు, సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్న విధానం, మెడిక‌ల్ ప‌రిక‌రాలు, మౌలిక స‌దుపాయాలు, వైద్యుల భ‌ద్ర‌త‌, వ‌ల‌స కార్మికులు, నిరుపేద‌ల‌కు ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్ వంటివాటిని సెంట్ర‌ల్ టీమ్స్ ప‌రిశీలిస్తాయ‌ని తెలిపారు.

Latest Updates