18మంది మెడికల్ అధికారులకు కరోనా వైరస్…

మధ్య ప్రదేశ్‌కు చెందిన 18మంది మెడికల్ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు కరోనా వైరస్ సోకింది. ఈవిషయాన్ని అక్కడి ప్రభుత్వం దృవీకరించింది.  డిపార్ట్‌మెంట్‌‌లో  మరెవరికైనా కరోనా వైరస్ లక్షనాలు ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకోవాలని కోరారు హెల్త్ కమిషనర్ ఫైజ్ అహ్మద్ కిద్వాయి. శివరాజ్ సింగ్ చౌహాన్  సీఎంగా ప్రమాణం చేసిన తరువాత అహ్మద్‌ను హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా అపాయింట్ చేశారు. కమల్‌నాథ్ ప్రభుత్వంలో ప్రతీక్ హజేలా కమిషనర్‌గా పనిచేశారు. కరోనా నివారించడానికి ప్రతీక్ సరైన చర్యలు తీసుకోలేదని సమాచారం. ప్రతీక్ అస్సాంలోని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) విభాగంలోపనిచేశారు.  అయితే అక్కడ కొన్ని వివాదాలు ఏర్పడేసరికి ప్రతీక్‌ను మధ్యప్రదేశ్‌కు పంపింది కేంద్రం.

ఎప్రిల్3న మెడికల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విజయ్ కుమార్ అనే అధికారికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అయితే ఆయనకు కరోనా ఎఫెక్ట్ అయినా ఆఫీస్ వచ్చారని, పలు మీటింగ్‌లలో పాల్గొన్నారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పాటు తాజాగా తమిళనాడుకు కూడా వెళ్లివచ్చారని… కొన్నినెలల ఆయన  సౌత్ ఆఫ్రికా ట్రిప్‌కు వెళ్లివచ్చారని తెలిపారు. వీరితో పాటు… హెల్త్ ప్రిన్సిపల్ పెక్రెటరి పల్లవి జైన్ గోవిల్, అడిషనల్ డైరెక్టర్ వీనా సిన్హా, డిప్యూటీ డైరెక్టర్ వీరేంద్రకుమార్ చౌదరీలకు కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది.

పల్లవి గోవిల్ మరియు సిన్హా కుమారులు ఈ మధ్యే అమెరికానుంచి వచ్చినట్లు తెలిసింది. అయితే తమ ప్రయాణపు వివరాలను అధికారులకు తెలియచేయలేదు. దీంతో పాటు కరోనా లక్షణాలు ఉన్నప్పుడు కూడా సీఎంతో జరిగిన పలు మీటింగ్‌లను కూడా గోవిల్ అటెండ్ అయ్యారని తెలిసింది. ఇదే డిపార్ట్‌మెంట్‌కు చెందని పలువురు అధికారులు ఐసోలేషన్‌లో ఉన్నారు. రిపోర్ట్స్ రావలసివుంది.

గోవిల్ కొడుకుకు మార్చ్16న ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో కరోనా టెస్ట్ చేశారని… 14రోజుల గృహనిర్భందంలో ఉండవలసిందిగా కోరారని అధికారులు తెలిపారు. అయితే ఎప్రిల్ 4న గోవిల్‌ను పరీక్షించగా ఆమెకు కోవిడ్ పాజిటీవ్ వచ్చింది. గోవిల్‌కు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయని డాక్టర్లు ఆమెను ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఆమె ఇంటివద్ద నోటీసుకూడా అంటించారు.  గోవిల్ వ్యక్తిగత సహాయకుడికి కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది.

మధ్యప్రధేశ్ లోని సోషల్ యాక్టివిస్ట్ అజయ్ దుబే మాట్లాడుతూ… ప్రభుత్వ అధికారులు వైరస్ వ్యాప్తి కాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారికి సంబంధించిన వారి ట్రావెల్ లిస్ట్ కూడా ప్రభుత్వం చెక్ చేయాలని కోరారు.  కరోనా సోకిన విజయ్ కుమార్ వైద్యుల ట్రీట్‌మెంట్‌కు సహకరించడంలేదని ఆరోపించారు.

హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక రిటైర్డ్ అధికారి మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే వైరస్ ప్రజల ఆరోగ్యాలను నాషనం చేస్తుందని…. అయితే నివారణ చర్యలు తీసుకునే ఆరోగ్యశాఖ అధికారులు ముందు వరుసలో ఉంటారు కావున వారి ఆరోగ్యం ఎప్పుడూ రిస్క్ లో ఉంటుందని అన్నారు. అయితే తమ డిపార్ట్‌మెంట్‌లో కనీసం చేతులు కడుక్కోవడానికి సబ్బు లేదని, శానిటైజర్ల కొరత ఉందని చెప్పాడు. అధికారులు సామాజిక దూరాన్ని పాటించడంలేదని తెలిపాడు.

Latest Updates