అత్య‌వ‌స‌రమైతే త‌ప్ప బ‌య‌టకు రాకండి.. క‌రోనా సోకిన ఎమ్మెల్యే సెల్ఫీ వీడియో

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రామగుండం, గోదావరిఖని, 8వ కాలనిలో రోజూరోజుకు కోవిడ్ బాధితులు సంఖ్య పెరుగుతుండటంతో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు భ‌య‌బ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలకు భరోసాను కల్పించే ప్రజాప్రతినిధులకు సైతం కరోన సోకడంతో పాలక వర్గం ఏమి చేయలో తెలియని పరిస్థితి లోకి వెళ్ళింది.

గత నెల రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 300 మందికి పైగా కరోన పాజిటివ్ రావడంతో ప్రజలు బయటకి రావాలంటేనే జంకుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో కరోన కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని డివిజన్లలో ప్రజలు స్వచందంగా లాక్ డౌన్ ఏర్పాటు చేసుకొని ఇంటికే పరితమయ్యారు. అటు సింగరేణిలో సైతం కార్మికులు కరోన బారిన పడటం తో సింగరేణి వ్యాప్తంగా లాక్ డౌన్ ఏర్పటు చేయాలని కార్మికులు అధికారులకు మొరపెట్టుకున్న పెడచెవ్వున పెడుతుందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పదిరోజుల క్రితం సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులలో నగర మేయర్ అనిల్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే కొరుకంటి చందర్ కు కరోనా సోకడం తో సింగరేణి అధికారులతో పాటు పార్టీ కార్యకర్తల్లోనూ అందోళన మొదలైంది. ప్రస్తుతం ఎమ్మెల్యే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉంటేనే బాగుంటుందని, ప్రజలెవ్వరూ భయబ్రాంతులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి నుండి సెల్ఫీ వీడియో ద్వారా రామగుండం ప్రజలకి మనోధైర్యాన్ని నింపుతున్నారు ఎమ్మెల్యే .

Latest Updates