కరోనా వైరస్ ఒక బయోలాజికల్ వార్

కరోనా వైరస్ బయోలాజికల్ వార్ లాంటిదని.. ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు గవర్నర్ తమిళి సై. రాజ్ భవన్ లో థర్మల్ స్క్రినిoగ్, సానిటైజర్ ఏర్పాటు చేశామన్నారు. ముందు జాగ్రత్తలతో కరోనాను ఎదుర్కోవచ్చన్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారికి కరోనా వైరస్ వచ్చిందని. ఇక్కడి వారికి కరోనా రాలేదన్నారు. చేతులు బాగా కడుక్కోవాలని.. ఇంట్లోనే ఉండాలన్నారు. తుమ్మేటపుడు చేతులు కాదు మో చేతిని అడ్డుపెట్టుకోవాలని సూచించారు. అందరూ స్వీయ నియంత్రణలో ఉండాలన్నారు. స్వీయ నియంత్రణే కరోనాకు సరైన మందన్నారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కరోనా వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్నారు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజ్ భవన్ లో కూడా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిస్తామన్నారు.

see more news

రెండో పెళ్లి చేసుకున్నఅమలాపాల్ .. ఫోటోలు వైరల్

బాలీవుడ్ సింగర్ కు కరోనా..లండన్ నుంచి రాగానే మూడు పార్టీలకు అటెండ్

Latest Updates