నల్గొండ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా రెండు కరోనా కేసులు నవెూదయ్యాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కోసం గాంధీ  ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ యువకుడు స్వగ్రామమైన నల్లగొండ సమీపంలోని దండెంపల్లికి జూన్‌ 2న వెళ్లాడు. తన ఇంట్లో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్నాడు. తర్వాత జూన్‌ 4న హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. తర్వాత అతనికి కరోనా లక్షణాలు  రావడంతో ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో అతనికి పాటివ్‌ వచ్చింది. దీంతో అతన్ని గాంధీకి తరలించిన అధికారులు.. అతని కాంటాక్టులు ఎవరని తేల్చేపనిలో పడ్డారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటికి చెందిన ఓ వృద్ధుడు రంజాన్‌ పండుగను హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు ఇంట్లో జరుపుకున్నాడు. అక్కడి నుంచి ఐదు రోజుల క్రితం చౌటుప్పల్‌ టౌన్‌కు వచ్చాడు. తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్న అతని నుంచి నమూనాలను సేకరించిన వైద్య సిబ్బంది… పరీక్షల కోసం గాంధీ దవాఖానకు పంపించారు. ఇందులో అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతన్ని చికిత్స కోసం గాంధీకి తరలించారు. ఆయన ఇంటి చుట్టుపక్కన ఉంటున్న 25 మందిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా సోకిన వ్యక్తి మందులు కొనుగోలు చేసిన మెడికల్‌ షాప్‌ను అధికారులు మూసివేశారు.

A health worker (R) checks the body temperature of a passenger before the departure of a special train service from Ahmedabad to New Delhi after the government eased a nationwide lockdown as a preventive measure against the spread of the COVID-19 coronavirus, at Sabarmati Railway Staion near Ahmedabad on May 12, 2020. (Photo by SAM PANTHAKY / AFP)

Latest Updates