పెద్దపల్లి జిల్లాలో తొలి కరోనా కేసు

పెద్దపల్లి జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో జిల్లాలోని NTPC అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసు నమోదు కావడంతో అలర్టైన జిల్లా అధికార యంత్రాంగం NTPC అన్నపూర్ణ కాలనీ తో పాటు పరిసర ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టారు. కాలనీల్లో బ్లీచింగ్ నిర్వహించారు. కరోన సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులను ఇప్పటికే క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారి సమాచారం తెలుసునే పనిలో ఉన్నారు అధికారులు.

మొదటి కేసు నమోదు కావడంతో పెద్దపల్లి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ్టి నుంచి నుండి జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినంగా చేపట్టాలని నిర్ణయించారు.

Latest Updates