మాల్స్ త‌ప్ప అన్ని షాపులు తెర‌వొచ్చు: లాక్ డౌన్ పై కేంద్ర హోం శాఖ గైడ్ లైన్స్

క‌రోనా లాక్ డౌన్ ఆంక్ష‌ల విష‌యంలో కేంద్ర హోం శాఖ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. షాపింగ్ మాల్స్ త‌ప్పించి ఇత‌ర షాపుల‌న్నీ ఓపెన్ చేసుకునేందుకు అనుమ‌తిస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెట్ యాక్ట్ కింద రిజిస్ట‌ర్ అయిన అన్ని షాపుల‌ను తెరిచేందుకు వీలు క‌ల్పించింది. అయితే హాట్ స్పాట్లు , కంటైన్మెంట్ జోన్ల‌లో మాత్రం ఎటువంటి స‌డ‌లింపులు లేకుండా క‌ఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల‌ని ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్ష‌న్ 10(2) కింద రివైజ్డ్ గైడ్ లైన్స్ ను శ‌నివారం జారీ చేసింది కేంద్ర హోం శాఖ‌.

ఏవి ఓపెన్.. ఏవి క్లోజ్.. నిబంధ‌న‌లేంటి?

  • గ్రామాల్లో అన్ని ర‌కాల షాపులు తెర‌వొచ్చు.
  • ప‌ట్ట‌ణాల్లోనూ మాల్స్ త‌ప్పించి అన్ని షాపులు ఓపెన్ చేయొచ్చు. రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్ ల‌లో ఉండే షాపులు కూడా తెరవొచ్చు. మాల్స్ కి బ‌య‌ట‌, వాటికి అనుకుని ఉండే చిన్న చిన్న దుకాణాలు కూడా ఓపెన్ చేసుకోవ‌చ్చు.
  • అన్ని ర‌కాల షాపుల్లోనూ గ‌తంలో క‌న్నా స‌గం మంది మాత్ర‌మే వ‌ర్క‌ర్స్ ప‌ని చేయాలి. సోష‌ల్ డిస్టెన్స్ పాటించడం త‌ప్ప‌నిస‌రి.
  • అయితే ప్ర‌స్తుతం ఎపిడ‌మిక్ డిసీజ్ యాక్ట్ -1897 అమలో ఉన్నందున ఈ ఆంక్ష‌ల స‌డ‌లింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకునే అధికారం ఉంటుంది.
  • తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే లాక్ డౌన్ ను మే 7 వ‌ర‌కు పొడిగించారు. అలాగే ఆ రోజు వ‌ర‌కు ఎటువంటి స‌డ‌లింపులు ఉండ‌బోవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

లిక్క‌ర్ షాపులు, సెలూన్స్ క్లోజ్

కేంద్ర హోం శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ పై ఆ శాఖ జాయింట్ సెక్రెట‌రీ పుణ్య స‌లిలా శ్రీవాస్త‌వ మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప‌రిధిలో షాపింగ్ మాల్స్ ఉంటే వాటిని తెర‌వ‌డానికి లేద‌ని చెప్పారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ మాల్స్ త‌ప్పించి మిగ‌తా షాపులు ఓపెన్ చేయొచ్చ‌ని, అయితే మార్కెట్ కాంప్లెక్సుల్లో ఉండే దుకాణాలు ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని స్ఫ‌ష్టం చేశారు. అలాగే ఈ – కామ‌ర్స్ కంపెనీలు నిత్యావ‌స‌రాలు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు. ఏ రాష్ట్రంలోనూ లిక్క‌ర్ షాపులు, రెస్టారెంట్లు ఓపెన్ చేయ‌డానికి వీలు లేద‌ని తెలిపారు శ్రీవస్త‌వ‌. అలాగే బార్బ‌ర్ షాపులు, సెలూన్స్, స్పాలు ఓపెన్ చేసేందుకు అనుమ‌తి లేద‌న్నారు. అయితే కంటైన్మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్ష‌ల స‌డ‌లింపు ఉండ‌బోద‌ని తెలిపారు.

Latest Updates