కరోనా సాకుతో అసెంబ్లీని కుదించుకున్నారు

1 లక్ష 20 వేలు ఉద్యోగాలు ఇచ్చామని  ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఒక్కో నియోకవర్గంలో లక్ష మంది నిరుద్యోగులు ఉన్నారని.. వాళ్లకు ఉపాధి లేదు.. ఉద్యోగాలు లేవన్నారు. ఐటీ సెక్టార్ లో 5,6 లక్షల ఉద్యగాలు ఇచ్చారని మంత్రి హరీష్ రావు చెబుతున్నాడు. కానీ వారంతా ఐటీ కంపెనీల్లో క్యాటరింగ్ సర్వీస్ చేస్తున్నారనీ తెలిపారు. తెలంగాణ తెచ్చుకుంది క్యాటరింగ్, డ్రైవర్స్ కోసమేనా అని మంత్రి హరీష్ ను ప్రశ్రించారు బండి సంజయ్.

ఉద్యమ నాయకుడిగా ఇదే నా మీరు చెప్పేదన్నారు. తెలంగాణ వాళ్ళంటే క్యాటరింగ్ , డ్రైవర్స్ మాత్రమేనా అన్నారు. స్థానికుల ఉద్యోగాలు దక్కకపోతే తెలంగాణ తెచ్చుకొని ఎందుకన్నారు. టీఆర్ఎస్ హయాంలో 12 వేల చిన్న పరిశ్రమలు మూతా పడ్డాయని తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చి ఏమి లాభమని..పరిశ్రమలకు చేయూత ఇవ్వడం లేదన్నారు. కరోనా రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కి  అదృష్టం కలిసి వచ్చిందని అసెంబ్లీని కుదించుకున్నారని తెలిపారు బండి సంజయ్.

Latest Updates