ధోనీకి కరోనా నెగటివ్

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీకి నిర్వహించిన కరోనా టెస్ట్​ల్లో నెగెటివ్ రిజల్ట్​ వచ్చింది. దీంతో చెన్నై వేదికగా ఆగస్టు 15 నుంచి 20 వరకు జరగనున్న సీఎస్‌‌కే కండీషనింగ్ క్యాంప్‌‌లో ధోనీ పాల్గొనడం ఖాయమైంది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి రాంచీలోని తన ఫామ్ హౌస్‌‌లోనే ఉంటున్న మహీ.. స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో కరోనా టెస్ట్‌‌కు శాంపిల్ ఇచ్చాడు.

కొవిడ్‌‌ నుంచి కోలుకున్న కరుణ్‌ నాయర్‌

‌కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌ బ్యాట్స్‌‌మన్‌‌ కరుణ్‌‌ నాయర్‌‌ కరోనాను జయించాడు. గత నెలలో నాయర్‌‌కు వైరస్‌‌ సోకినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అప్పట్నించి హోమ్‌‌ ఐసోలేషన్‌‌లోనే ఉండి చికిత్స తీసుకున్నాడని తెలిపాయి. అయితే ఈనెల 8న నిర్వహించిన ఫ్రెష్‌ టెస్ట్‌‌లో అతనికి నెగెటివ్‌‌ వచ్చినట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌‌ కోసం యూఏఈ వెళ్లేం దుకు నాయర్‌‌కు మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం మరో మూడుసార్లు నెగెటివ్‌‌ రిపోర్ట్‌‌ వస్తేనే .. టీమ్‌‌తో కలిసి యూఏఈ వెళ్లేందుకు నాయర్‌‌కు అనుమతిస్తారు.

Latest Updates