‘కరోనా జంతువుల నుంచే వచ్చింది.. ల్యాబ్ నుంచి కాదు’

కరోనావైరస్ ల్యాబ్ లో పుట్టిందికాదని.. అది జంతువుల నుంచి వచ్చిందని డబ్ల్యూహెచ్‌ఓ వ్యాఖ్యానించింది. చాలా దేశాలు కరోనా చైనాలోని ల్యాబ్ లో పుట్టిందని అనుకున్నారు కానీ, అది జంతువుల నుంచి సంక్రమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రస్తుతం తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం కరోనా వైరస్ జంతువుల నుంచి వచ్చినట్లు అనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి ఫడేలా చైబ్ అన్నారు. అంతేకానీ ఈ వైరస్ ల్యాబ్ లోనో లేదా మరెక్కడో పుట్టలేదని ఆమె అన్నారు. ‘మానవులకు, జంతువుల వైరస్ ఎలా సోకిందో స్పష్టంగా తెలియదు, కాని ఖచ్చితంగా ఇది ఒక జంతువు నుంచి వచ్చిందని మాత్రం చెప్పగలం. ఈ వైరస్ చాలావరకు గబ్బిలాలలో ఉంటుంది. అయితే ఈ వైరస్ గబ్బిలాల నుండి మానవులకు ఎలా సోకిందో తెలియాలంటే ఇంకా కొన్ని పరీక్షలు చేయాలి. వైరస్ ప్రయోగశాల నుండి బయటకు వచ్చిందనే దానికి నేను ఒప్పుకోను. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వైరస్ పై పరీక్షలు చేసిందనడానికి మరియు ఆ ల్యాబ్ వల్లే వైరస్ వ్యాప్తి చెందింది అనడాన్ని కూడా నేను సమర్థించను. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుఎన్ ఏజెన్సీకి నిధులు ఇచ్చేదిలేదని నిర్ణయం తీసుకున్నారు. మేం కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాం. కరోనా నియంత్రణకు మేం ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి ఫడేలా చైబ్ అన్నారు.

కరోనావైరస్ మహమ్మారి చైనాలోని వూహాన్ లోని ఒక ప్రయోగశాల నండి వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం వ్యాఖ్యానించారు. అంతేకాకుండా డబ్ల్యూహెచ్‌ఓకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఆపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

For More News..

జియోలో వాటా కొన్న ఫేస్‌బుక్

Latest Updates