ఒకరి నుంచి ఇద్దరికి.. ఇద్దరి నుంచి నలుగురికి

కేరళలో 65 లక్షల మందికి వైరస్ సోకొచ్చు: 2.35 లక్షల మంది చనిపోవొచ్చు
వెంటనే కఠిన చర్యలు తీసుకోండి: కేరళ హైకర్టుకు ఐఎంఏ లేఖ

కేరళలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే కరోనావైరస్ సోకిన ప్రతి వ్యక్తి నుంచి ఇద్దరికి, వారిద్దరి నుంచి మరో నలుగురికి, ఆ నలుగురి నుంచి మరో ఎనిమిది మందికి.. ఇలా వైరస్ వేగంగా లక్షలాది మందికి వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్​ మెడికల్ అసోసియేషన్​ (ఐఎంఏ) కొచ్చిన్​ బ్రాంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వెంటనే కఠినమైన చర్యలు తీసుకోకుంటే దాదాపు 65 లక్షల మందికి కరోనా సోకుతుందని, 2.27 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. బుధవారం కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఐఎంఏ లేఖ రాసింది. జనం గుంపులుగా తిరగకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, జన సంచారాన్ని కంట్రోల్ చేయాలని, లేకుంటే భారీ విపత్తును చవిచూడాల్సి వస్తుందని లేఖలో పేర్కొంది.

19 శాతం మందికి ముప్పు..

కరోనావైరస్ మరింతగా విజృంభిస్తే.. కేరళ మొత్తం జనాభాలో19 శాతం అంటే.. 65 లక్షల మందికి వ్యాపించే ప్రమాదం ఉందని ఐఎంఏ అంచనా వేసింది. వీరిలో 15 శాతం (9.40లక్షలు) మందిని కనీసం 10 రోజుల పాటు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుందని, 2.35 లక్షల మందికి ఐసీయూ బెడ్స్ అవసరం అవుతాయని తెలిపింది. వైరస్ ఈ స్థాయిలో వ్యాపిస్తే .. 2.27 లక్షల మంది

చనిపోవచ్చని వివరించింది. వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా 7 శాతమే ఉంటుందని అనుకున్నా, 24 లక్షల మందికి సోకుతుందని, అప్పుడు కూడా హాస్పిటల్స్, సౌకర్యాలు ఏమాత్రం సరిపోవని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో జన సాంద్రత ఎక్కువగా ఉన్నం దున కరోనా వ్యాపించే అవకాశం 19 శాతం కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చని స్పష్టం చేసింది. ఆలస్యంగా చర్యలు తీసుకుంటే.. డ్యాంలో నీళ్లు కిం దికి పోయి ఊళ్లను ముంచెత్తిన తర్వాత షట్టర్లు వేసినట్టే అవుతుందని స్పష్టం చేసింది. బయటకు పోయినప్పుడు ఇతరులతో కనీసం ఆరు ఫీట్ల దూరం మెం టెయిన్ చేయాలని ఐఎంఏ కొచ్చిన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ సూచించారు. వైరస్ ముప్పు తగ్గేవరకూ జనం ఇండ్లలోనే ఉండాలన్నారు. యువకులకు వైరస్ సోకినా బాగా నే కన్పి స్తారని, కా నీ వారు ‘సూపర్ స్ప్రెడర్స్’గా వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేసే ప్రమాదం ఉందన్నారు.

Latest Updates