ఐసోలేష‌న్ వార్డు నుంచి త‌ప్పించుకొన్న‌ క‌రోనా బాధితురాలు

క‌రోనా వైరస్ సోకిన ఓ మ‌హిళ.. ఐసోలేష‌న్ వార్డు నుంచి త‌ప్పించుకొని తిరిగి త‌న ఇంటికి రావ‌డం న‌ల్గొండ జిల్లాలో క‌ల‌క‌లం రేపుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. న‌ల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామానికి చెందిన ఓ మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆమెను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు త‌ర‌లించారు.అయితే ఈరోజు ఆ క‌రోనా బాధితురాలు ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకొని త‌న ఇంటికి చేరుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తుల భయాందోళనల‌కు గుర‌య్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఆమెను 108 వాహనంలో తిరిగి ఆస్పత్రికి తరలించారు.

Latest Updates