కింగ్ కోఠిలో టెన్షన్: మర్కజ్‌కు పోయొచ్చిన వ్యక్తికి పాజిటివ్ 

అతడి ఇంట్లో 46 మంది ఫ్యామిలీ మెంబర్స్

మర్కజ్ పోయొచ్చినోళలో్ల ఎక్కువమందికి వైరస్ సోకినట్లు బయటపడుతోంది. కిందటి నెలలో తబ్లిగికి వెళ్లొచ్చిన హైదరాబాద్ లోని కింగ్ కోఠి ప్రాంతానికి చెందిన ఆరుగురిని అధికారులు హాస్పిటల్‌కు తరలించారు. అందులో
ఒకరికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు శనివారం వెల్లడించారు. దీంతో కింగ్ కోఠి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మిగిలిన ఐదుగురి శాంపిల్ టెస్టుల రిజల్ట్స్ రానున్నాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తికుటుంబ సభ్యులు 46 మంది ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరందరినీ హోం క్వారంటైన్ లో ఉంచామని, శాంపిల్స్ సేకరించి ఫీవర్ ఆస్పత్రికి తరలించామని జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హేమలత తెలిపారు.

మిగిలిన ఐదుగురి ఇళల్్లలోనూ ఒక్కొక్కరి ఇంట్లో 20 మందికి పైగా నివాసం ఉంటున్నారని, ఐదుగురి మెడికల్ రిపోర్ట్స్ రాగానే వారి కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా సేకరిస్తామని చెప్పారు. ఈ ఆరుగురు ఢిల్లీ వెళ్లి వచ్చాక.. వారి ఎవరెవరిని కాంటాక్ అట్ య్యారో అధికారులు తెలిసుకునే పనిలో పడ్డారు. మరోవైపు అబిడ్స్ డివిజన్ ఏసీపీ భిక్షంరెడ్డి , నారాయ
ణగూడ ఇన్స్పెకర్ రమేశ్ కుమార్ కింగ్ కోఠి ప్రాంతంలో ఇంట ింటికీ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో స్థానికుల్లో టెన్షన్ మొదలైంది.

Latest Updates