ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలు దాటిన కరోనా కేసులు

మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,33,875 కు చేరింది. ఇందులో 3,66,894 మంది కరోనాతో చనిపోయారు. 26,61,212 మంది కరోనా నుంచి కోలుకోగా 30,05,769 మంది చికిత్స పొందుతున్నారు.

అత్యధికంగా అమెరికాలో 17,93,530 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా బ్రెజిల్ లో  4,68,338, రష్యాలో 3,87,623, స్పెయిన్లో  2,85,644, యూకేలో 2,71,222, ఇటలీలో 232,248, ఫ్రాన్స్ లో1,86,835, జర్మనీలో 1,83,019, ఇండియాలో 1,73,763, టర్కీలో 1,62,120 కేసులు నమోదయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా 3,66,894 మంది కరోనాతో చనిపోగా అత్యధికంగా అమెరికాలో 1,04,542 మంది చనిపోయారు. ఆ తర్వాత  యూకేలో 38,161, ఇటలీలో 33,229, ఫ్రాన్స్ లో 28,714 మంది చనిపోయారు.

Latest Updates