క‌రోనా భ‌యం: మియాపూర్ ప‌రిధిలో బారికేడ్లు

కరోనా పాజిటివ్ కేస్ లు పెరుగుతున్న క్ర‌మంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను కోవిడ్ 19 కంటోన్మెంట్ క్లస్టర్లుగా ప్రకటించారు అధికారులు. హాఫిజ్ పేట్ లో ఎక్కువ మంది జమాత్ కు వెళ్లి వచ్చిన వారు ఉండడంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. హాఫిజ్ పేట్ లోని ఆదిత్యనగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, ప్రేమ్ నగర్, మార్తాండ నగర్ బస్తీలు క్లస్టర్ పరిధిలోకి వస్తాయి.

వీటితో పాటు మియాపూర్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న రాజారామ్ కాలనీ, జనప్రియ నగర్ లతో పాటు ఆల్విన్ కాలనీ నుండి కొండాపూర్ వెళ్లే రహదారి వెంబడి ఉన్న రోడ్డు కిరు వైపులా ఉన్న రహదారులు మూసివేశారు. మియాపూర్ పరిధిలోని మొత్తం 54 ప్రధాన, అంతర్గత రోడ్లను పోలీసులు క్లోజ్ చేశారు. క్లస్టర్ల లోపల ఉన్న వారికి నిత్యావసర సరుకులను ఇంటికే పంపించే విధంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు అధికారులు. నిర్బంధ కాలనీలలో ఉన్న ప్రజలు ఎట్టి పరిస్థితులలో బయటకు రావద్దని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Latest Updates