95 లక్షలు దాటిన కేసులు..90 లక్షలకు చేరువలో రికవరీ

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 35 వేల 551 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 95 లక్షల 34 వేల 965 కి చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 526 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 38 వేల 648కు చేరింది. నిన్న మరో 40 వేల 726 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ 89 లక్షల 73 వేల 373  మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 22వేల 943యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా11లక్షల11వేల 698 టెస్టులు చేశారు.

ఉద్యోగం వచ్చిన గంటల్లోనే… రైలు నుంచి కింద పడి యువతి మృతి

 

 

Latest Updates