తెలంగాణ‌లో వెయ్యి దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం కొత్త‌గా 11 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది రాష్ట్ర ఆరోగ్య శాఖ‌. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరిన‌ట్లు చెప్పింది. ఇందులో 25 మంది మర‌ణించ‌గా.. 316 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని వెల్ల‌డించింది. ప్రస్తుతం 660 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది.

రాష్ట్రంలో అత్య‌ధికంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోనే 540 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆదివారం కొత్త న‌మోదైన 11 కేసులు కూడా GHMC ప‌రిధిలోనివే. ఇప్ప‌టి వ‌ర‌కు సూర్యాపేట జిల్లాలో 83, నిజామాబాద్ లో 61, గ‌ద్వాల్ లో 45, వికారాబాద్ జిల్లాలో 37 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

Corona positive cases toll crossed thousand mark in Telangana

Latest Updates