శ్రీలంక నేవీలో 29 మందికి ​ కరోనా పాజిటివ్​

కొలంబో: శ్రీలంక నేవీకి చెందిన 29 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకినట్లు గుర్తించారు. వీరితో కలిపి శ్రీలంకలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 368కి చేరినట్టు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ‘‘సుదువెళ్ల, జాయిలా ప్రాంతాల్లో కరోనా అనుమానిత రోగులను గుర్తించేందుకు ఈ మధ్యన జరిపిన సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా 29 మంది నేవీ సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో వెలసర నేవీ క్యాంపును ఐసోలేటెడ్ ప్రాంతంగా ప్రకటించాం’’ అని ఆర్మీ కమాండర్ షవేంద్ర సిల్వా మీడియాకు చెప్పారు.

Latest Updates