ఏపీలో కొత్తగా 3,892 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో 69,463 కరోనా టెస్టులు చేయగా 3,892 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,67,465 కు చేరింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. మరోవైపు గత 24 గంటల సమయంలో కరోనాతో ట్రీట్ మెంట్ పొందుతూ  28 మంది మృతి చెందారు.

చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో నలుగురు చొప్పున…తూర్పుగోదావరి,గుంటూరు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం, శ్రీకాకుళంలో ఇద్దరు చనిపోగా..కర్నూలు,విజయనగరం, పశ్చిమగోదావరి ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో కరోనాతో రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 6,319కి చేరింది.

24 గంటల వ్యవధిలో 5,050 మంది కరోనా నుంచి కోలుకోగా…41,669 యాక్టివ్ కేసులున్నాయి.

Latest Updates