ఉస్మానియాలో ఏడుగురు జూనియర్ డాక్టర్లకు కరోనా

హైదరాబాద్ : ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏడుగురు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం పీజీ స్టూడెంట్స్ అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే పాజిటివ్ వచ్చినా.. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటున్నారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శశికళ. వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ప్రిన్సిపల్ శశికళ.

ఇద్దరు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలకు కరోనా సోకిందని..వారిని గాంధీ హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా కరోనా లక్షణాలు లేకున్నా జూనియర్ డాక్టర్లందరికీ కరోనా టెస్టులు చేస్తున్నామని తెలిపిన ప్రిన్సిపల్.. క్లాస్ రూమ్స్, ల్యాబ్ లను శానిటైజ్ చేస్తున్నామన్నారు. జూన్ 20 నుంచి పరీక్షలు ఉన్నందున జూనియర్ డాక్టర్లను హోంక్వారంటైన్ చేస్తున్నామన్నారు. ఒకవేళ కరోనా టెస్టులో ఇంకా ఎవరికైనా పాజిటివ్ వస్తే వారిని గాంధీ హాస్పిటల్ కు తరలిస్తామని.. మిగతావారిని హోంక్వారంటైన్ చేస్తామని చెప్పారు ప్రిన్సిపల్. మరోవైపు ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని కోరుతున్నారు జూనియర్ డాక్టర్లు.

Latest Updates