టీటీడీలో 98 మందికి కరోనా

టీటీడీలో 98 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దాంతో ఉద్యోగులకు ఎక్కువ టెస్టులు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఎస్పీఎఫ్ సిబ్బంది సెలవులపై ఊర్లకు వెళ్ళి రావడం వల్ల కరోనా టీటీడీలో చాలామందికి సోకిందని ఆయన అన్నారు. చాలా మంది సిబ్బందికి సింప్టమ్స్ లేకపోయినా టెస్టుల్లో మాత్రం పాజిటివ్ వస్తోందని ఆయన అన్నారు. ఒకవేళ తిరుమలకు వచ్చే భక్తుల ద్వారా కరోనా వ్యాపిస్తోందా అనే విషయంపై కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు.

For More News..

కరోనా వస్తే ప్రజాప్రతినిధులు కూడా గాంధీలోనే చేరాలి

ట్రెయినింగ్‌ కోసం కారు అమ్మకానికి పెట్టిన ప్లేయర్

ఊపందుకున్న సైకిల్ సవారీ

గ్రేటర్లో కరోనా మృతులకోసం ప్రత్యేక శ్మశానాలు!

Latest Updates